Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

గంట్లకుంటాలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ..

⏩వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాలి: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి..

గంట్లకుంటాలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ..
Share Short Clip Download PDF

పాలకుర్తి(రైట్స్ మీడియా): పెద్దవంగర మండలం గంట్లకుంటా గ్రామంలో తెలంగాణ వీరనారి, ధైర్యసాహసాలకు ప్రతీక అయిన చాకలి ఐలమ్మ మన పాలకుర్తి నియోజకవర్గంలో జన్మించడం నియోజకవర్గ ప్రజలందరికీ గర్వకారణమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి అన్నారు.

పెద్దవంగర మండలం గంట్లకుంట గ్రామంలో ఏర్పాటు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రాజేందర్ రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ..

తెలంగాణ చరిత్రలో చాకలి ఐలమ్మ గారికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. అణచివేత, అన్యాయానికి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి, ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరనారి ఐలమ్మ అని కొనియాడారు. చాకలి ఐలమ్మ మన పాలకుర్తి నియోజకవర్గంలో పుట్టడం మనందరి గర్వకారణమని, ఆమె చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

సామాన్య కుటుంబంలో జన్మించినప్పటికీ అసామాన్యమైన ధైర్యంతో ఐలమ్మ సాగించిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మహిళా శక్తికి, ఆత్మగౌరవానికి, సామాజిక న్యాయానికి ఆమె జీవితం ఒక గొప్ప ఉదాహరణ అన్నారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ..

టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ..

చాకలి ఐలమ్మ ఒక వర్గానికే పరిమితమైన నాయకురాలు కాదని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహనీయురాలని అన్నారు. తన హక్కుల కోసం, అణగారిన ప్రజల కోసం ఆమె చూపిన తెగువ, ధైర్యం ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు.

మన నియోజకవర్గ నేలపై జన్మించిన ఐలమ్మ చరిత్ర మనకు గర్వకారణమే కాకుండా ఒక బాధ్యతను కూడా గుర్తుచేస్తుందని ఝాన్సీ అన్నారు. ఆమె పోరాట స్ఫూర్తిని యువతకు, మహిళలకు తెలియజేసి సామాజిక న్యాయం, సమానత్వం కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

గంట్లకుంటలో ఏర్పాటు చేసిన ఐలమ్మ విగ్రహం కేవలం విగ్రహంగా కాకుండా ఆత్మగౌరవానికి, మహిళా ధైర్యానికి, అన్యాయాన్ని ఎదిరించే పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలవాలని నాయకులు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు చాకలి ఐలమ్మ వారసురాలు చిట్యాల శ్వేతా, స్థానిక సర్పంచ్ పాయిలి యకలక్ష్మి సోమన్న, మండల అధ్యక్షులు రంగు మురళి, వట్టే జనయ్య యాదవ్, కొండ్రాతి శ్రీనాథ్, కొమురుమల్లు, యకయ్య, ఉమచందర్, శ్రీకాంత్, మాజీ గీత కార్మిక కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవి గౌడ్, డా. కూరపాటి రమేష్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, చైతన్య రజక సంఘం నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ..
గంట్లకుంటాలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ..