సత్తుపల్లి( రైట్స్ మీడియా): క్రీడా పోటీల్లో గెలుపోటములు సహజమని.. మనం క్రీడా స్ఫూర్తిని మాత్రమే పెంపొందించుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
సత్తుపల్లిలో మువ్వా యూత్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరుగుతున్న 72వ రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ ఛాంపియన్షిప్ ఫైనల్ పోటీలను శుక్రవారం నిర్వహించగా.. మంత్రి పొంగులేటి తన సతీమణి మాధురమ్మతో కలిసి హాజరై.. ఖమ్మం- రంగారెడ్డి సెమీఫైనల్స్, ఆ తర్వాత రంగారెడ్డి - నల్లగొండ ఫైనల్స్ మ్యాచ్ లను ఆసాంతం వీక్షించారు. విజేతగా నిలిచిన నల్లగొండ జట్టుకు ట్రోఫీ బహుకరించారు.