Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

వివో (VIVO) భవనాల నిర్మాణంలో వేగం పెంచాలి

విబిజి రాంజీ పథకం ద్వారా గ్రామాలు అభివృద్ధిచర్యలు: జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్

వివో (VIVO) భవనాల నిర్మాణంలో వేగం పెంచాలి
Share Short Clip Download PDF

విబిజి రాంజీ పథకం ద్వారా గ్రామాలు అభివృద్ధిచర్యలు: జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్

మహబూబాబాద్ జిల్లా(రైట్స్ మీడియా): జిల్లాలో (387) భవనాలు మంజూరు కాగా, (90) భవనాల నిర్మాణాలు ప్రారంభం కానీ నేపథ్యంలో సంబంధిత సర్పంచులు, అధికారులతో నిర్మాణం విషయంలో కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసే ఉద్దేశంతో ప్రభుత్వం చేపడుతున్న 'వివో' (VIVO) భవనాల నిర్మాణం, వాటికి సంబంధించి తీసుకుంటున్న, నిధుల సమర్థవంతమైన వినియోగం పారదర్శకత, వివో భవనాల నిర్మాణ పనులకు సంబంధించి కేటాయించిన నిధులు సకాలంలో విడుదలయ్యేలా చూస్తూ, నాణ్యతా ప్రమాణాలు పాటించేలా ఇంజనీరింగ్ అధికారులతో ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిశీలనలు (Monitoring) నిర్వహించాలని, స్థానిక సేవలకు కేటాయింపు
ఈ భవనాలు పూర్తయిన తర్వాత వాటిని కేవలం కార్యాలయాలుగా మాత్రమే కాకుండా, ప్రజలకు అవసరమైన వివిధ ప్రభుత్వ సేవలందిస్తూ బహుళ ప్రయోజన కేంద్రాలుగా (Multi-purpose community spaces) ఉపయోగపడేలా ప్రణాళిక రూపొందించడం జరుగుతున్నదన్నారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ

నిర్మాణ వేగవంతం భూమిపూజ కార్యక్రమాలు పూర్తయిన చోట పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా భవనాల నిర్మాణాలు పూర్తయ్యేలా స్థానిక ప్రజాప్రతినిధులు , యంత్రాంగం సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, ఈ భవనాల నిర్మాణం ద్వారా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితో పాటు ప్రజలకు మెరుగైన పాలనను మరింత వేగంగా అందించవచ్చు అనే గొప్ప ఉద్దేశంతో భవనాల నిర్మాణం చేపట్టిందని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, పిఆర్ఈఈ, డిపిఓ రేవంత్, డివిజనల్ పంచాయతీ అధికారి పుల్లారావు, ఏపిఓలు, సంబంధిత గ్రామాల సర్పంచ్ లు, వివో అధ్యక్ష, కార్యదర్శలు, పంచాయతీ కార్యదర్శిలు తదితరులు పాల్గొన్నారు.

వివో (VIVO) భవనాల నిర్మాణంలో వేగం పెంచాలి