దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు: టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్
తెలంగాణ శాసనసభ స్పీకర్ దళిత బిడ్డ గడ్డం ప్రసాద్ కుమార్ పై ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఎమ్మెల్సీ పదవి నుండి మధుసూదన్ వెంటనే భర్తరఫ్ చేయాలని తెలంగాణ రాష్ట్ర పీసీసీ సభ్యులు పెండెం రామానంద్ అన్నారు.
దిష్టిబొమ్మ దగ్ధం
నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు వరంగల్ రోడ్డు అమరవీరుల స్తూపం వద్ద నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పంబి వంశీకృష్ణ, నర్సంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తి కిరణ్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టి మాజీ సీఎం కెసిఆర్, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
అనంతరం టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ మాట్లాడుతూ
సమాజంలో అణగారిన వర్గాల నుంచి ఎదిగి తెలంగాణ శాసనసభ అత్యున్నత రాజ్యాంగబద్ధమైన వ్యవస్థకు స్పీకర్‌గా సేవలందిస్తున్న దళిత బిడ్డ గడ్డం ప్రసాద్ కుమార్ గౌరవాన్ని కించపరిచే విధంగా బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ తాతా మధుసుధన్ మాట్లాడటం అత్యంత బాధాకరం మని మండిపడ్డారు. రాజకీయ విభేదాలు ఉండవచ్చు విమర్శలు చేయవచ్చు కానీ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిపై వ్యక్తిగతంగా అనుచితంగా మాట్లాడటం రాజకీయ సంస్కారం కాదని స్పష్టం చేశారు. గడ్డం ప్రసాద్ కేవలం ఒక వ్యక్తి కాదు రాజ్యాంగం కల్పించిన అవకాశాలతో అత్యున్నత స్థానానికి ఎదిగిన దళిత బిడ్డ అలాంటి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అంటే కేవలం ఒక వ్యక్తిని అవమానించడం కాదు దళిత సమాజ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ తాతా మధు వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ఇకనైనా హద్దులు దాటి మాట్లాడే ధోరణిని మానుకోవాలని దళిత బిడ్డగా అత్యున్నత పదవికి ఎదిగిన గడ్డం ప్రసాద్ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ దళిత సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను దళితుల ఆత్మగౌరవాన్ని అవమానించే వారిని బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలంగాణ రాష్ట్ర ప్రజలే తగిన సమాధానం చెబుతారు అని ఘాటుగా హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నర్సంపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చింతల సాంబరెడ్డి, నర్సంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా, వరంగల్ జిల్లా ఓబీసీ అధ్యక్షులు ఓర్సు తిరుపతి, వరంగల్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ, వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల సాంబయ్య గౌడ్, జిల్లా నాయకులు, జిల్లా, మండల మహిళా నాయకురాళ్లు, నర్సంపేట కౌన్సిలర్లు నర్సంపేట సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు, పట్టణ కాంగ్రెస్ నాయకులు, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.