హైదరాబాద్(రైట్స్ మీడియా): మినిస్టర్ క్వార్టర్స్‌లో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కుడా (కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) చైర్మన్ గుండు సుధారాణి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఇటీవల కుడా చైర్మన్‌గా గుండు సుధారాణి నియమితులైన సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అనంతరం ఆమెను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా కుడా పరిధిలో పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేలా సమన్వయంతో ముందుకు సాగాలని మంత్రి సూచించారు. కుడా చైర్మన్‌గా గుండు సుధారాణి విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించాలని మంత్రి ఆకాంక్షించారు.