Saturday, 19 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

హుజురాబాద్ గణపతి నిమజ్జన ఉత్సవ సమితి నూతన కార్యవర్గం ఎన్నిక

హుజురాబాద్ గణపతి నిమజ్జన ఉత్సవ సమితి నూతన కార్యవర్గం ఎన్నిక
Share Short Clip Download PDF

హుజురాబాద్ పుర పాలక సంఘం ఆధ్వర్యంలో 2026 సంవ త్సరానికి గణపతి నిమజ్జన ఉత్సవ సమితి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గణపతి నవరాత్రులు, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుoడా నిర్వహించేందుకు సమితి ప్రభుత్వ శాఖల అధికారులు, గణపతి మండపాల నిర్వాహకుల మధ్య సమన్వయకర్తగా వ్యవహరించనుంది. పురపాలక, పోలీస్, విద్యుత్, అగ్నిమాపక, రెవెన్యూ శాఖల అధికారులతో సమన్వయం చేసు కుంటూ అవసరమైన ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహించి, నవరాత్రులు, నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేలా సమితి బాధ్యతలు నిర్వర్తించనుంది.

గణపతి నిమజ్జన ఉత్సవ సమితి నూతన కార్యవర్గం:

అధ్యక్షుడిగా బుర్ర నటరాజ్,ఉపాధ్యక్షులుగా కన్నన్ దురైరాజ్, నల్లగొని రాకేష్, కోరపల్లి సురేష్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ విష్ణుదాసు గోపాల్ రావు, సహ కార్య దర్శులుగా సందీప్ ఐత, పంజాల సతీష్, కోశా ధికారిగా కొమురవెల్లి సంతోష్ ఎన్నికయ్యారు.
కార్యవర్గ సభ్యులుగా బుసారపు శ్రీనివాస్, ఆకుల సదానందం, నూనె సదానందం, కం దుల సందీప్, నాగ కోయల్కర్ సుమన్, మేకల మల్లేష్ కొనసాగనున్నారు.