హైదరాబాద్(రైట్స్ మీడియా): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు (ఎమ్మెల్యే) డాక్టర్ జటోత్ రాంచంద్ర నాయక్ ను నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో ఈ భేటీ జరిగింది.

ఈ సందర్భంగా రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమాయత్తం, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, గ్రాడ్యుయేట్ల సంక్షేమం మరియు సమస్యల పరిష్కారంపై ఇరువురు నాయకులు విస్తృతంగా చర్చించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, పార్టీ శ్రేణులను మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లాలని ఈ భేటీలో నిర్ణయించారు.