Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీపతి కొమరమ్మకు రూ.3 లక్షల ఎల్ఓసీ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

⏩పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం.. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాల అమలు: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీపతి కొమరమ్మకు రూ.3 లక్షల ఎల్ఓసీ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
Share Short Clip Download PDF

హనుమకొండ (రైట్స్ మీడియా): వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 65వ డివిజన్ దేవన్నపేట గ్రామానికి చెందిన శ్రీపతి కొమురమ్మ అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్పందించారు. ఆమె వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందించేందుకు మంజూరైన రూ.3 లక్షల ఎల్ఓసి చెక్కును హన్మకొండలోని తన నివాసంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ...

ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్కరూ మెరుగైన వైద్య చికిత్సకు దూరం కాకూడదనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య సహాయం అందించడం ద్వారా బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

ప్రజా ప్రభుత్వం పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములవుతూ, అవసరమైన సమయంలో వారికి అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చులు భారంగా మారకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అవసరమైన వైద్య సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అయ్యాల రాంరెడ్డి, దేవన్నపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఏరుగొండ శ్రీనివాస్, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీపతి మల్లేశం, సీనియర్ నాయకులు చేరాలు, రవి, రమేష్, ఎర్ర ప్రకాష్,యూత్ నాయకులు ఆరేళ్లి సురేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.