జనగామ/పాలకుర్తి (రైట్స్ మీడియా డెస్క్): కాంగ్రెస్ శ్రేణులతో పాటు నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. ఆదివారం జనగామ జిల్లా దేవరుప్పుల మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఇటీవల మరణించిన కాంగ్రెస్ నాయకులు, ఉపాధ్యాయులు, కార్యకర్తల కుటుంబాలను ఎమ్మెల్యే నేరుగా సందర్శించి పరామర్శించారు. మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
బాధితులకు అండగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి: దేవరుప్పులలో శోకసంతప్త కుటుంబాలకు పరామర్శ
పెద్దమాడూర్:
గ్రామ కంటెస్టెంట్ సర్పంచ్ గనుపాక నరసయ్య తండ్రి కొండయ్య ఇటీవల మృతి చెందగా, వారి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే మృతుని చిత్రపటానికి నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి, ఆర్థిక సాయం అందించారు. అలాగే కాంగ్రెస్ నాయకుడు గనుపాక రవి తల్లి ఐలమ్మ మృతి చెందడంతో వారి నివాసానికి వెళ్లి పూలమాల వేసి అంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ఆర్థిక సాయం అందజేశారు.
కొల్కొండ:
ఏఎంసీ డైరెక్టర్ నల్ల సత్యనారాయణ తల్లి ఇటీవల మరణించడంతో కొల్కొండలోని వారి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే, మృతురాలి చిత్రపటానికి అంజలి ఘటించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
కడవెండి:
కడవెండికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఎర్రం రెడ్డి ఇంద్రసేనారెడ్డి ఇటీవల మృతి చెందడంతో వారి గృహాన్ని సందర్శించిన ఎమ్మెల్యే, కుటుంబ సభ్యులను పరామర్శించి శోకసంతాపం తెలిపారు.
హాజరైన నాయకులు..
ఈ పరామర్శల్లో దేవరుప్పుల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దావెరా అనిల్ కుమార్, జిల్లా నాయకుడు తోటకూరి పాండుకృష్ణ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఇనుముల నాగరాజు, బీసీ సెల్ అధ్యక్షుడు కాడబోయిన గణేష్, కిసాన్ సెల్ అధ్యక్షుడు గోపు సుధాకర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పులిగిల్ల వెంకన్న, గుగులోతు రాజేందర్, రుద్రోజు భాస్కర చారి, రెడ్డి రాజుల రమేష్, తోటకూర రమేష్, సైదులు రెడ్డి, రవీందర్ రెడ్డి, ముదిగొండ పరశురాములు, వార్డు సభ్యులు పానుగంటి ప్రశాంత్, పురుషోత్తం చారి, ఎన్ఎస్యూఐ నాయకుడు కొంగరి ఉమేష్, అప్పిరెడ్డిపల్లి సర్పంచ్ అనూష నర్సింగరావు, రాంబోజిగూడెం సర్పంచ్ ధనలక్ష్మి భాస్కర్, కొల్కొండ గ్రామాధ్యక్షుడు బిసు శ్రీనివాస్, దామెర పెద్దులు, మాజీ సర్పంచ్ రవి తదితరులు పాల్గొన్నారు.