హైదరాబాద్ (రైట్స్ మీడియా): జమ్మూలో నిర్వహించిన అండర్-17 జాతీయ స్థాయి చెస్ పోటీల్లో రజత పతకం సాధించి, వరల్డ్ యూత్ కామన్‌వెల్త్ పోటీలకు ఎంపికైన WCM, WFM టైటిల్ హోల్డర్ శివాంశిక ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించి సత్కరించారు.
చిన్న వయసులోనే చెస్‌లో ప్రతిభ చాటుతూ జాతీయ స్థాయిలో రజత పతకం సాధించడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే వరల్డ్ యూత్ కామన్‌వెల్త్ పోటీలకు ఎంపిక కావడం గర్వకారణమని తెలిపారు.
భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. శివాంశిక తన ప్రతిభతో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలవాలని అభిలషించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో శివాంశికను మంత్రి అభినందించి సత్కరించారు.