Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీలో భారీగా చేరికలు

ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీలో భారీగా చేరికలు
Share Short Clip Download PDF

మేడ్చల్ మల్కాజిగిరి (రైట్స్ మీడియా): దేశ భద్రత, సర్వతోముఖ అభివృద్ధి కేవలం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే సాధ్యమని విశ్వసించి పలువురు యువత, మహిళలు భారతీయ జనతా పార్టీలో చేరారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, అల్వాల్ మండలం, తుర్కపల్లి (190వ) డివిజన్ అధ్యక్షులు మంద విజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ తమ శామీర్ పేట్ నివాసంలో వారికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి, శుభాకాంక్షలు తెలిపారు.

పార్టీలో చేరిన వారిలో శ్రీధర్ గౌడ్, మంద కిరణ్, శ్రావణి, సాయి భాస్కర్, నరేష్ యాదవ్, కుంచ శ్రీకాంత్ గౌడ్, శిరీష గౌడ్, ప్రసాద్ రెడ్డి, రాజా లక్ష్మి, దేవ్, ప్రవీణ్, లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు డి. గిరివర్ధన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల మాణిక్య రెడ్డి మరియు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీలో భారీగా చేరికలు