హైదరాబాద్ (రైట్స్ మీడియా): మావల మండలం బట్టిసవర్గాం గ్రామంలోని కొమురం భీం కాలనీ ఆదివాసుల ఇళ్ల పట్టాల సమస్యను వెంటనే పరిష్కరించాలని బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రాజ్భవన్లో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను ఎంపీ మాధవనేని రఘునందన్ రావు, ఆదివాసులతో కలిసి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వినతిపత్రం అందజేశారు.
ఆదివాసుల ఇళ్ల పట్టాల సమస్యను వెంటనే పరిష్కరించాలి..
⏩బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్.
⏩ఆదివాసుల సమస్యలు పరిష్కరించకపోతే సెక్రటేరియట్ ముందు ధర్నా: ఎమ్మెల్యే పాయల్ శంకర్
⏩రాజ్భవన్లో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను ఎంపీ మాధవనేని రఘునందన్ రావు, ఆదివాసులతో కలిసి వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. .
ఈ సందర్భంగా పాయల్ శంకర్ మాట్లాడుతూ..
మావల మండలం, బట్టిసవర్గాం గ్రామంలోని సర్వే నం. 72లో ఉన్న కొమురం భీం కాలనీలో సుమారు 500 ఆదివాసీ కుటుంబాలు 30 ఏళ్లుగా నివసిస్తున్నప్పటికీ, ఇళ్ల పట్టాలు లేకపోవడంతో విద్యుత్, తాగునీరు వంటి కనీస సౌకర్యాలకు దూరమవుతున్నారని తెలిపారు. వెంటనే అర్హులైన కుటుంబాలకు ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన గవర్నర్, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఆదివాసుల సమస్యలను ఇప్పటికే అసెంబ్లీలో ప్రస్తావించినా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. నెల రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే, 2 వేల కుటుంబాలతో కలిసి సెక్రటేరియట్ ముట్టడికి దిగుతామని హెచ్చరించారు.