Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత: ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

• అచ్చమ్మకుంటలో పశు వైద్యశాల ప్రారంభం.

గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత: ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
Share Short Clip Download PDF

నరసరావుపేట(రైట్స్ మీడియా): మాచర్ల మండలం, అచ్చమ్మకుంట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన పశు వైద్యశాలను నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, స్థానిక నాయకులు ధారానాయక్, ఇతర అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ,

అచ్చమ్మకుంటలో ఏర్పాటు చేసిన పశు వైద్యశాల దాదాపు 9 పంచాయతీలు, గ్రామాల ప్రజలకు ఉపయోగపడనుందని తెలిపారు. రైతులు, పశుపోషకులకు పశువైద్య సేవలు మరింత చేరువ కావడంతో పాటు, పశువుల ఆరోగ్య సంరక్షణకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ పశు వైద్యశాలను అందుబాటులోకి తీసుకురావడంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, స్థానిక నాయకులు చేసిన కృషిని అభినందించారు.

పిల్లల ఆరోగ్యం – ఆరోగ్యకరమైన జీవనశైలి

కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన పాఠశాల విద్యార్థులను ఎంపీ అభినందించారు. పట్టణ ప్రాంతాల పిల్లలతో పోలిస్తే గ్రామీణ, గిరిజన తండాల పిల్లలు ఆరోగ్యంగా, దృఢంగా ఉండటం అభినందనీయమని అన్నారు. పెద్దలు కూడా పిల్లల మాదిరిగా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, మద్యం వినియోగాన్ని తగ్గించి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.

ప్రతి ఇంటికీ తాగునీరు

మాచర్ల నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు రూ.1.09 కోట్ల నిధులు మంజూరై, పనులు ప్రారంభమైనట్లు ఎంపీ తెలిపారు. ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.

ROFR పట్టాలపై చర్యలు

అటవీ హక్కుల చట్టం కింద ఇవ్వాల్సిన ROFR పట్టాల విషయంలో కూడా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. సుమారు 250 మంది పట్టాల అంశంపై ఎమ్మెల్యేతో కలిసి సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నామని చెప్పారు. రెవెన్యూ, అటవీ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని మాచర్ల నియోజకవర్గంలో సుమారు 1,500 మందికి త్వరలో ROFR పట్టాలు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ROFR పట్టాలపై చర్యలు

రోడ్లు, విద్యుత్ సమస్యల పరిష్కారం

అటవీ సరిహద్దుల వెలుపల ఉన్న గ్రామాల రహదారులను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీ తెలిపారు. గ్రామాల్లో ట్రాన్స్‌ఫార్మర్లకు సంబంధించిన సమస్యలను వారంలోగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

రోడ్లు, విద్యుత్ సమస్యల పరిష్కారం

యువతకు ఉపాధి అవకాశాలు

పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత తమ విద్యార్హతలు, వివరాలను అందజేస్తే ప్రైవేట్ రంగంలోని ఎలక్ట్రానిక్స్ తదితర సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని ఎంపీ తెలిపారు.

యువతకు ఉపాధి అవకాశాలు

సూర్య ఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సూర్య ఘర్ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలు తమ ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవాలని ఎంపీ సూచించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సూర్య ఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

రైతులు, మహిళలకు ఉపాధి కల్పించేలా క్లస్టర్లు

గ్రామీణ మహిళలు, రైతులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు డైరీ, వ్యవసాయం లేదా మిర్చి పంట ఆధారిత క్లస్టర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థానిక వనరులు, రైతుల అవసరాలకు అనుగుణంగా క్లస్టర్లను అభివృద్ధి చేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేస్తామని చెప్పారు.

మాచర్ల నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో పశువైద్యం, తాగునీరు, రహదారులు, విద్యుత్, ఉపాధి, రైతులు, మహిళలు, గిరిజనుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.

రైతులు, మహిళలకు ఉపాధి కల్పించేలా క్లస్టర్లు

Source / reference: Journalist Sk. Gouse, Palnadu.