మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఏసీబీ ట్రాప్ తో సీఐ ఆంజనేయులు, ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి పట్టుబడటం హాట్ టాపిక్గా మారింది. లంచం తీసుకున్న కేసులో సీఐ, ఎస్ఐలను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే సీఐ, ఎస్ఐ పట్టుబడటంతో స్థానికుల సంబరాలు చేసుకున్నారు. కీసర, బోగారం గ్రామాల వారు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. పలు కేసుల్లో లంచం ఇవ్వాలంటూ వేధించారని స్థానికులు ఆరోపించారు.
ఏసీబీకి చిక్కిన కీసర సీఐ, ఎస్ఐ.. స్థానికుల సంబరాలు