రెవెన్యూకు సంబంధించిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉండకుండా నిర్ణీత గడువులోగా పరిష్కార చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ జిల్లా నడికూడ మండల తహసిల్దార్ కార్యాలయంలో జరుగుతున్న భూభారతి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు.
దరఖాస్తుల పరిశీలన, పరిష్కారానికి తీసుకుంటున్న చర్యల గురించి తహసీల్దార్ రాణి, ఇతర అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కార్యాలయంలోని రికార్డు రూము నిర్వహణ తీరును కలెక్టర్ పరిశీలించారు. రికార్డు రూముకు సంబంధించిన పలు అంశాలను తహసిల్దార్ ను అడిగి తెలుసుకున్నారు.