Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

వర్దన్నపేటలో ఘనంగా కాళోజి జయంతి వేడుకలు

వర్దన్నపేటలో ఘనంగా కాళోజి  జయంతి వేడుకలు
Share Short Clip Download PDF

ప్రజాకవి, తెలంగాణ వైతాళికుడు, స్వాతంత్ర్య సమరయోధుడు కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా వర్ధన్నపేట మున్సిపల్ కార్యాలయమలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి కాళోజి నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా చైర్మన్ పాలకుర్తి సారంగపాణి మాట్లాడుతూ..

ఆయన చేసిన సామాజిక సేవలు, తెలంగాణ భాషా సంస్కృతి పరిరక్షణకు అందించిన సేవలను స్మరించుకున్నారు. కాళోజి నారాయణరావు తన రచనల ద్వారా ప్రజల సమస్యలను, సామాజిక అసమానతలను, అన్యాయాలను నిర్భయంగా ప్రశ్నించారని తెలిపారు. ప్రజల పక్షాన నిలబడి తన కలంతో సమాజంలో చైతన్యం తీసుకువచ్చిన మహనీయుడిగా కాళోజి చిరస్మరణీయులని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజల భాష, యాస, సంస్కృతి, సంప్రదాయాల పట్ల కాళోజికి ఉన్న అభిమానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. యువత కాళోజి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంచార్జి కమీషనర్ కమ్మం కృష్ణ, అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.