హనుమకొండ జిల్లాలోని శాయంపేట మండలంలో నాలుగు పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్ వి రాజు గౌడ్ ఆకస్మిక పరిశీలన చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు పత్తిపాక మరియు శాయంపేట (బాలికలు) మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు పత్తిపాక మరియు శాయంపేట లలో విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలను తరగతి గదిలో ప్రశ్నించడం ద్వారా రాబట్టారు. మధ్యాహ్న భోజన అమలు తీరును పరిశీలించారు. పత్తిపాక ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య కేవలము 22 మాత్రమే ఉండటం వల్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యా కార్యక్రమాలు నిరంతరము చేపట్టి విద్యార్థుల సంఖ్యని పెంచాల్సిందిగా ప్రధానోపాధ్యాయురాలు మాధవిని ఆదేశించారు. విద్యార్థుల సామర్థ్యాలు కూడా తక్కువగా ఉండడాన్ని గమనించారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల శాయంపేటలో ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరస్ కాంటినెంట్ స్కూల్ గా ఎంపిక అయినందున FLN లో సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులు జవాబులు చక్కగా ఇచ్చారు.

తరగతి గదిలో విద్యార్థుల విద్య సామర్థ్యాలను జిల్లా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ బండారి మన్మోహన్ పరిశీలించారు. పాఠశాలలో ప్రభుత్వ పథకాల అమలు తీరును వసతులను ముఖ హాజరును జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ బి మహేష్ పరిశీలించారు.