హనుమకొండ, అక్టోబర్ 26(రైట్స్ మీడియా): సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజపాయ్ హనుమకొండలోని శిశు గృహాన్ని ఆకస్మికంగా సందర్శించారు.

ఈ సందర్భంగా కలెక్టర్.. పిల్లల సంరక్షణకు సంబంధించి పలు సూచనలు చేశారు.

చలికాలంలో పిల్లలను వెచ్చగా ఉండే దుస్తులు వేసి చుట్టు పరిసరాలు పరిశుభ్రం గా ఉంచుతూ, వారికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పిల్లల ఆరోగ్య పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అలాగే, అర్హులైన పిల్లలందరికీ LFA ప్రక్రియను పూర్తి చేసి, అడాప్షన్ (CARA) పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు.

పిల్లలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులు ఏవైనా ఉంటే, వాటిని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

పిల్లల ఆరోగ్యం, భద్రత, సంక్షేమం, దత్తత ప్రక్రియను వేగవంతం చేయడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు.