హనుమకొండ(రైట్స్ మీడియా): భద్రకాళి దేవాలయంలో నిర్వహించనున్న శరన్నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ఉత్సవాలకు హాజరుకావాలని కోరుతూ హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి కి దేవాలయ ఆలయ కార్య నిర్వహణ అధికారి సునీత, ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు ఆహ్వాన పత్రికను శనివారం కలెక్టరేట్ లో అందజేశారు. భద్రకాళి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలలో భాగంగా ఈ నెల 11 నుంచి 21వ తేదీ వరకు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు, కల్యాణోత్సవం, ఊరేగింపు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కు ఆలయ ఈవో, ప్రధానార్చకులు తెలిపారు. ఈ కార్యక్రమాలకు జిల్లా కలెక్టర్ తప్పకుండ విచ్చేయాలని వారు కోరారు.