Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

అలీపురా బస్తీని సందర్శించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

⏩ముస్లిం కమ్యూనిటీ హాల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి..

అలీపురా బస్తీని సందర్శించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
Share Short Clip Download PDF

హనుమకొండ(రైట్స్ మీడియా):వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 59వ డివిజన్ అలీపురా బస్తీలో శనివారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తో కలిసి పర్యటించారు. అలీపురా బడే మసీదు ఆవరణలో స్థానిక పరిస్థితులను పరిశీలించి, ప్రజలకు అందుతున్న మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న ముస్లిం కమ్యూనిటీ హాల్ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. బస్తీలోని డ్రైనేజీ వ్యవస్థ, అంతర్గత రహదారులను పరిశీలించి, విద్యుత్ సమస్యలు, మరమ్మతులపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. పెండింగ్‌లో ఉన్న మరమ్మతులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు.

స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను గుర్తించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, సమస్యలపై నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు ఈవీ శ్రీనివాస్ రావు, టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు, స్థానిక నాయకులు నబీన్, మజార్, తెల్ల కిషోర్, సుగుణ , శ్రుతి తదితర నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

అలీపురా బస్తీని సందర్శించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి