Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

పీఎం రహత్ పథకం ద్వారా రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు తక్షణ వైద్య సహాయం

పీఎం రహత్ పథకం ద్వారా అర్హులైన బాధితులకు రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్యం: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

పీఎం రహత్ పథకం ద్వారా రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు తక్షణ వైద్య సహాయం
Share Short Clip Download PDF

పీఎం రహత్ పథకం ద్వారా అర్హులైన బాధితులకు రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్యం: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

హైదరాబాద్/జయశంకర్ భూపాలపల్లి(రైట్స్ మీడియా): రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించి ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం రహత్ పథకం ద్వారా అర్హులైన బాధితులకు రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్యం అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు.

శనివారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీస్, రవాణా, పంచాయతి రాజ్, ఆర్ అండ్ బి, జాతీయ రహదారులు, వైద్య ఆరోగ్య శాఖల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. పోలీసుల ధ్రువీకరణ పొందిన అర్హులైన బాధితులకు ప్రమాదం జరిగిన తేదీ నుంచి గరిష్ఠంగా ఏడు రోజుల పాటు ఉచిత చికిత్స అందుతుందని తెలిపారు. ప్రమాద వివరాల ధ్రువీకరణకు పోలీసులకు 24 గంటల గడువు ఉంటుందని, టీఎంఎస్ 2.0, ఈడీఏఆర్ వ్యవస్థల ద్వారా బాధితుల వివరాలను అనుసంధానం చేస్తారని పేర్కొన్నారు. 112 అత్యవసర సేవల ద్వారా తక్షణ వైద్య సహాయం అందించడంతో పాటు ఆసుపత్రులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

అనంతరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ

పీఎం రహత్ పథకం అమలు విధానంపై డేటా ఎంట్రీ ఆపరేటర్లకు సమగ్ర శిక్షణ అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితుల వివరాల నమోదు, పథకం మార్గదర్శకాలు, శాఖల మధ్య సమన్వయంపై సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో పథకం అమలులో ఎలాంటి లోపాలు లేకుండా, రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో పోలీస్, రవాణా, పంచాయతి రాజ్, ఆర్ అండ్ బి, జాతీయ రహదారులు, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అనంతరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ