Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు...

కాళేశ్వరం ప్రాజెక్టుతోనే హైదరాబాద్‌తో పాటు పరిశ్రమలు, వ్యవసాయానికి నీటి సరఫరా: బిఆర్ఎస్ నేతలు

కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు...
Share Short Clip Download PDF

కాళేశ్వరం ప్రాజెక్టుతోనే హైదరాబాద్‌తో పాటు పరిశ్రమలు, వ్యవసాయానికి నీటి సరఫరా: బిఆర్ఎస్ నేతలు

జయశంకర్ భూపాలపల్లి(రైట్స్ మీడియా): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌస్‌లను శనివారం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద గౌడ్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి సందర్శించి పరిశీలించారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ...

హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరాకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఏర్పడటంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సమకూర్చుకోవడం ప్రజలకు ఆర్థిక భారంగా మారుతోందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరా కోసం ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఖాళీ బిందెలతో జలమండలి కార్యాలయం ఎదుట నిరసనలు తెలిపిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు.

కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసిందని తెలిపారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ...

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలతో పాటు పరిశ్రమలకు, వ్యవసాయానికి నీటిని అందించాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని గతంలో కేసీఆర్ ప్రభుత్వం సాగునీరు, తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో తాగునీటి సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.

ప్రభుత్వం తన పాలనాపరమైన లోపాలను సరిదిద్దుకోవాల్సింది పోయి, ప్రతిపక్ష నాయకులపై విమర్శలు చేస్తూ ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు.

ప్రభుత్వానికి ప్రజల సమస్యలు తెలియజేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం, ఇంటెలిజెన్స్ వ్యవస్థపై కూడా ఉందని పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని హితవు పలికారు.

ప్రతిపక్ష నాయకులపై బెదిరింపులకు దిగడం కాకుండా, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు...