ఖమ్మం, అక్టోబర్ -26(రైట్స్ మీడియా): పాలేరు నియోజకవర్గంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, నిర్ణీత గడువులోగా అన్ని పనులను పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.
సోమవారం స్థానిక శ్రీ శ్రీ సర్కిల్ లోని క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, అదనపు కలెక్టర్ పీ. శ్రీనివాస రెడ్డి లతో కలిసి ఇంజనీరింగ్, ఇరిగేషన్, వ్యవసాయం, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్ తదితర శాఖల అధికారులతో మంత్రి సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. పనుల పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, నిధుల మంజూరుపై అధికారులతో విస్తృతంగా చర్చించారు.