ఖమ్మం, అక్టోబర్- 29 (రైట్స్ మీడియా): రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు సత్వర వైద్య సేవలు అందించి, వారి ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా అమలు చేస్తున్న పీఎం రాహత్ పథకం క్రింద జిల్లాలోని ఆరోగ్యశ్రీ జాబితాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు తప్పని సరిగా నమోదు కావాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పారస్ కుమార్తో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఎం రాహత్ పథకం నోడల్ అధికారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పథకం లక్ష్యాలు, అమలు విధానం, ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వివరించారు.