హైదరాబాద్ (రైట్స్ మీడియా): తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన స్వర్గీయ గడ్డం వెంకటస్వామి (కాకా) 97వ జయంతి ఉత్సవాల్లో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి, గడ్డం వెంకటస్వామి (కాకా) సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.