పాలకుర్తి (రైట్స్ మీడియా): పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 54 మంది లబ్ధిదారులకు మొత్తం ₹54,00,864 విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులను అందజేసి, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి లబ్ధిదారుడు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.