Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

మహనీయుల ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి: టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి

⏩మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి ల జయంతి సందర్భంగా గాంధీ భవన్‌లో ఘనంగా నివాళులు..

మహనీయుల ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి: టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్  ఝాన్సీ రాజేందర్ రెడ్డి
Share Short Clip Download PDF

హైదరాబాద్(రైట్స్ మీడియా): జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా హైదరాబాద్ గాంధీ భవన్‌లో ఘనంగా నివాళులర్పించారు. పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మహాత్మాగాంధీ విగ్రహానికి, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్‌లతో కలిసి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి అందించిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. సత్యం, అహింస, శాంతి, దేశభక్తి, నిజాయితీ వంటి మహనీయుల ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు.

దేశ స్వాతంత్య్ర సమరంలో మహాత్మాగాంధీ చేసిన సేవలు, స్వాతంత్య్ర అనంతరం దేశ నిర్మాణంలో లాల్ బహదూర్ శాస్త్రి అందించిన సేవలు చిరస్మరణీయమని నాయకులు కొనియాడారు. వారి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సంక్షేమం, దేశ అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మహనీయుల ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి: టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్  ఝాన్సీ రాజేందర్ రెడ్డి

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మహిళ రాష్ట్ర నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొని మహనీయులకు ఘనంగా నివాళులు అర్పించారు.

మహనీయుల ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి; : టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్  ఝాన్సీ రాజేందర్ రెడ్డి
మహనీయుల ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి: టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్  ఝాన్సీ రాజేందర్ రెడ్డి