హనుమకొండ (రైట్స్ మీడియా): వడ్డేపల్లిలో దళిత సంఘం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఫాదర్ కొలంబో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మెడికేర్ జనరల్ హాస్పిటల్ వారి సహకారంతో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్, రక్తదాన శిబిరంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య శిబిరాన్ని సందర్శించి వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బందిని అభినందించారు. శిబిరానికి వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులోనే మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇలాంటి ఆరోగ్య శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
అత్యవసర సమయాల్లో రక్తదానానికి యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలి: ఎమ్మెల్యే KR నాగరాజు
⏩మెగా హెల్త్ క్యాంప్, రక్తదాన శిబిరంలో పాల్గొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.
అనంతరం రక్తదాన శిబిరాన్ని సందర్శించి రక్తదానం చేస్తున్న దాతలను అభినందించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, అత్యవసర సమయాల్లో రక్తం అందుబాటులో ఉండేందుకు యువత, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు అవసరమైన వారికి వైద్య సేవలు అందించడం అభినందనీయమని తెలిపారు. ప్రజా ఆరోగ్య పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు, వైద్య సంస్థలు చేపడుతున్న సేవా కార్యక్రమాలకు తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో దళిత సంఘం గ్రామ కమిటీ ప్రతినిధులు, వైద్యులు, వైద్య సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.