ఉత్సవాలకు వచ్చే చిన్నారులు తప్పిపోకుండా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. పిల్లల చేతికి తల్లిదండ్రుల మొబైల్ నంబర్‌తో కూడిన ట్యాగ్‌ను ఫ్రెండ్షిప్ బ్యాండ్ తరహాలో ఏర్పాటు చేస్తే, తప్పిపోయిన సందర్భంలో వారిని తల్లిదండ్రులకు సులభంగా అప్పగించేందుకు వీలుంటుందని తెలిపారు.
ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సంజయ్ మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని బతుకమ్మ, దసరా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సహకరించాలని కోరారు.
ఈ కార్యమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎల్ కిషోర్ కుమార్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీ వైవి గణేష్, సెంట్రల్ జోన్ డీసీపీ కవిత, గ్రంథాలయ చైర్మన్ మీసాల ప్రకాశ్, డియార్వో విజయలక్ష్మి, ఆర్డీవో సుమ సంబంధిత శాఖఅదికారులు మరియు,ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు గోపాల్ నవీన్ రాజు
కమిటీ అధ్యక్షుడు నాగపూరి సంజయ్ బాబు, జనరల్ సెక్రెటరీ మెడిది మధుసూదన్, ప్రధాన కార్యదర్శి మధుసూదన్, కోశాధికారి మండ వెంకన్న గౌడ్, సంయుక్త కోశాధికారి వెలిది శివమూర్తి, ఉత్సవ కన్వీనర్ వొడ్నాల నరేందర్, ట్రస్ట్ చైర్మన్ వంగరి కోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు