న్యూఢిల్లీ, అక్టోబర్ 6 (రైట్స్ మీడియా): దేశంలో 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (ఎస్ఐఆర్) పేరుతో అర్హులైన కోట్ల కొద్దీ పౌరుల ఓటు హక్కును బీజేపీ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కుట్రపూరితంగా తొలగిస్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్ మల్లు రవి తీవ్రంగా మండిపడ్డారు. మంగళవారం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ అన్యాయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి ఆధ్వర్యంలో పార్లమెంట్ మకర ద్వారం నుంచి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) కార్యాలయం వరకు భారీ ప్రొటెస్ట్ ర్యాలీ నిర్వహించినట్లు వెల్లడించారు.
"ఈరోజు పార్లమెంట్ మకర ద్వారం దగ్గర నుంచి బయలుదేరి ప్రొటెస్ట్ ర్యాలీ కాంగ్రెస్ పార్టీ, ఇండియా అలయన్స్ పార్టీలు ఎస్పీ, ఎన్సీపీ, ఆర్జేడీ, సీపీఎం, సీపీఐ ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఉన్న టీఎంసీ అందరం ఎంపీలు పార్లమెంట్ నుంచి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫీస్ వరకు పాదయాత్రలు, ఎలక్ట్రోరల్ ర్యాలీగా వెళ్ళడం జరిగింది. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కలిగించాల్సిన బాధ్యత ఈసీపై ఉంది" అని ఆయన తెలిపారు.