నల్లబెల్లి, అక్టోబర్ 6(రైట్స్ మీడియా):
నల్లబెల్లి మండలం గొల్లపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం లేక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరుతూ గ్రామస్థులు మంగళవారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని కలిశారు. గ్రామానికి బస్సు సర్వీసు లేకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వెంటనే స్పందించి, గొల్లపల్లి గ్రామ ప్రజలకు ఇబ్బందులు లేకుండా త్వరలో నూతన బస్సు సర్వీసు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అనంతరం నల్లబెల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పురుషోత్తం సురేష్, నర్సంపేట డిపో NMU గౌరవ అధ్యక్షుడు వేముల సాంబయ్య కలిసి నర్సంపేట డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. త్వరలోనే గొల్లపల్లి గ్రామానికి బస్సు సర్వీసు ప్రారంభిస్తామని డిపో మేనేజర్ హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో NSUI నర్సంపేట డివిజన్ అధ్యక్షుడు బెతి భరత్, మండల NSUI అధ్యక్షుడు మంద శివకుమార్, మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఆవుల అనిల్, నల్లబెల్లి వార్డు సభ్యుడు మసంపెల్లి అఖిల్, మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్‌చార్జి గద్దల సురేష్, యూత్ నాయకులు ఇట్టబోయిన సందీప్, ఎర్ర రమేష్, సానబోయిన రాము, కోలా ప్రకాష్, మర్రి నాగరాజు, అజ్మీరా రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.