Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

వేలేరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

⏩ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి.. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలి: హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

వేలేరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
Share Short Clip Download PDF

హనుమకొండ(రైట్స్ మీడియా): ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో ఓపి సేవలకు సంబంధించిన రిజిస్టర్ ను కలెక్టర్ పరిశీలించారు. ఎంతమంది వైద్యులు, సిబ్బంది ఉన్నారు, ఎంతమంది విధులకు హాజరయ్యారని అడిగి తెలుసుకున్నారు. ఆన్లైన్ లో నమోదు చేసిన అటెండెన్స్ ని కలెక్టర్ పరిశీలించారు. మీ ప్రమాణం యాప్ లో ఏయే వివరాలు నమోదు చేస్తున్నారని అడిగారు. లాబొరేటరీ రూమును పరిశీలించి ఏ ఏ పరీక్షలు చేస్తున్నారని వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలోని ఇన్ పేషెంట్ వార్డు ను కలెక్టర్ సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న పేషంట్లతో వైద్య సేవలు గురించి ఆరా తీశారు. వారి ఆరోగ్య సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ...

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలను అందించాలన్నారు. ఆరోగ్య కేంద్రంలో అందించే వైద్య సేవలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మేఘన, తహసిల్దార్ కోమి, ఇతర అధికారులు పాల్గొన్నారు.