హనుమకొండ(రైట్స్ మీడియా): గండి రామారం ఎత్తిపోతల పథకం ద్వారా అతి త్వరలోనే వేలేరు మండలానికి గోదావరి జలాలు తీసుకువచ్చి, రెండు పంటలకు సాగు నీరు అందిస్తానని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇచ్చారు.
వేలేరు మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి- షాదీ ముబారక్ మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణి కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా వేలేరు మండలానికి సంబందించిన 04గురు కల్యాణ లక్ష్మి -షాదీ ముబారక్ లబ్ధిదారులకు 4లక్షల 464 రూపాయల విలువగల చెక్కులను అలాగే 09మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు 3లక్షల 49వేల 500రూపాయల విలువగల చెక్కులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పంపిణి చేశారు.
అనంతరం ఇటీవల జరిగిన దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స తీసుకొని విశ్రాంతి తీసుకుంటున్న వేలేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మురావత్ లక్ష్మణ్ నాయక్ ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని తగిలిన గయాలను పరిశీలించారు. నిందితులకు కఠిన శిక్ష పడే విధానంగా చూస్తామని అన్నారు. అధైర్య పడవద్దని ఎమ్మెల్యే గా నేను కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే పీచర గ్రామానికి చెందిన శివరాత్రి వెంకటలక్ష్మి ఇటీవల మరణించగా ఆమె చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ తర్వాత ధర్మసాగర్ మండలం నారాయణగిరి చెందిన పింగిలి మణెమ్మ ఇటీవల మరణించగా ఆమె చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.