నిజామాబాద్(రైట్స్ మీడియా): ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ వృద్ధుడు న్యాయపోరాటం చేస్తున్నాడు. అధికారులు స్పందించకపోవడంతో మీడియాను ఆశ్రయించాడు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో నందిపేట మండలం సిమ్రాజ్ పల్లి కి చెందిన పూర్ణచంద్రరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నందిపేట్ మండలం సిమ్రాజ్ పల్లి ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా కు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.. పక్కనే ఉన్న తన స్థలాన్ని కూడా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని తెలిపారు.
సిమ్రాజ్ పల్లి గ్రామానికి చెందిన పూర్ణచంద్రరావు గత కొన్ని రోజులుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పటికీ ఎలాంటి లాభం లేకుండా పోయింది. మాజీ సర్పంచ్ మరియు మాజీ సర్పంచ్ మరో వ్యక్తి తప్పుడు పత్రాలను సృష్టించి, ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. అధికారులు భూ కబ్జాదారులకు అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. కబ్జా చేసిన భూమిని గతంలో పట్టాలు కలిగి ఉన్న ప్రజలకు తిరిగి ఇవ్వాలని అధికారులను కోరారు.