హైదరాబాద్(రైట్స్ మీడియా): తెలంగాణ ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునికంగా, సమగ్రంగా, ప్రయాణికులకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. తెలంగాణ ప్రభుత్వం, TGSRTC, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) సంయుక్తంగా ఆర్టీసీ - మెట్రో కామన్ పాస్, ‘MeeTicket’ మొబైల్ యాప్, డిజిటల్ వీక్లీ బస్ పాస్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి.
హైదరాబాద్ ప్రజాభవన్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కామన్ పాస్, MeeTicket యాప్, డిజిటల్ వీక్లీ బస్ పాస్‌లను లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రులు వివేక్ వెంకటస్వామి, మహమ్మద్ అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.