Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

'సేవా సంకల్ప్ అభియాన్'లో ఎంపీ ఈటల రాజేందర్: సఫాయి కార్మికులకు ఘన సత్కారం

⏩కొంపల్లిలో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించిన మల్కాజిగిరి ఎంపీ

'సేవా సంకల్ప్ అభియాన్'లో ఎంపీ ఈటల రాజేందర్: సఫాయి కార్మికులకు ఘన సత్కారం
Share Short Clip Download PDF

⏩ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు

హైదరాబాద్/మేడ్చల్ (రైట్స్ మీడియా): జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలో నిర్వహించిన వేడుకల్లో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొని, బీజేపీ శ్రేణులతో కలిసి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభసందర్భాన్ని పురస్కరించుకుని చేపట్టిన "సేవా సంకల్ప్ అభియాన్" కార్యక్రమంలో భాగంగా శ్రమదానం చేసి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ చురుగ్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రతకు అహరహం శ్రమిస్తున్న సఫాయి కార్మికులతో ముచ్చటించి, సమాజానికి వారు అందిస్తున్న సేవలను కొనియాడుతూ వారిని ఘనంగా సత్కరించారు.

'సేవా సంకల్ప్ అభియాన్'లో ఎంపీ ఈటల రాజేందర్: సఫాయి కార్మికులకు ఘన సత్కారం

ఈ కార్యక్రమంలో మేడ్చల్-మల్కాజిగిరి (అర్బన్) జిల్లా బీజేపీ అధ్యక్షులు డి. గిరివర్ధన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయశ్రీ, రాష్ట్ర నాయకులు డా. ఎస్. మల్లారెడ్డి, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు జే.కే. శేఖర్ యాదవ్, బీజేపీ జిల్లా నాయకులు రాజిరెడ్డి, శివాజీ రాజు, మాధురి, జనార్దన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పెద్దబుద్ధుల సతీష్ సాగర్, శ్రీనివాస్ యాదవ్, బీజేవైఎం రాష్ట్ర నాయకులు సాయి కృష్ణ రెడ్డి, శ్యామ్ కిరణ్ రెడ్డి మరియు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

'సేవా సంకల్ప్ అభియాన్'లో ఎంపీ ఈటల రాజేందర్: సఫాయి కార్మికులకు ఘన సత్కారం
'సేవా సంకల్ప్ అభియాన్'లో ఎంపీ ఈటల రాజేందర్: సఫాయి కార్మికులకు ఘన సత్కారం