Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
ప్రాతినిధ్యం

వర్ధన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ఆలస్యం!

ఆకలితో అలమటిస్తున్న విద్యార్థులు..

వర్ధన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ఆలస్యం!
Share Short Clip Download PDF

మధ్యాహ్నం 12-30 గంటలకు పెట్టాల్సిన భోజనం మధ్యాహ్నం 3 గంటలకు!

వర్ధన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం పథకం అస్తవ్యస్తంగా తయారైంది. సమయానికి భోజనం అందించకపోవడంతో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు.

అసలేం జరుగుతోంది..?

నిబంధనల ప్రకారం మధ్యాహ్నం 12:30 నుండి 1:00 గంటల లోపు విద్యార్థులకు భోజనం పెట్టాలి. కానీ వర్ధన్నపేట జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం 2:30 నుండి 3:30 గంటలకు భోజనం పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 10 గంటలకు కాలేజీకి వచ్చే విద్యార్థులు 3 గంటల వరకు ఆకలితో ఉండాల్సి వస్తోంది. దీంతో చాలా మంది విద్యార్థులు క్లాసుల్లో నీరసంగా ఉంటున్నారు. కొందరు సొమ్మసిల్లుతున్నారు.

తల్లిదండ్రుల ఆగ్రహం :

ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజనం పెడితే, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పిల్లలు పస్తులు ఉంటున్నారు. ఇంటర్ చదివే పిల్లలు పెద్దవాళ్లు, వారికి సరైన టైంకు భోజనం పెట్టకపోతే ఎలా? వెంటనే జిల్లా ఇంటర్మీడియట్ అధికారి (DIEO), మండల విద్యాశాఖ అధికారి కళాశాలను సందర్శించి భోజనం సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.కలెక్టర్ జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలి అని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

వర్ధన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ ను వివరణ:

వర్ధన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ ను వివరణ కోరగా శనివారం రోజున మధ్యాహ్నం 12:30 గంటలకి రావాల్సిన మధ్యాహ్న భోజనం 2:40 గంటలకు రావడం వలన హాజరైన 27 మంది విద్యార్థిని విద్యార్థులలో 25 మంది విద్యార్థిని విద్యార్థులు ఆకలి తట్టుకోలేక వెళ్లిపోయినారని తెలిపారు.

వర్ధన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ఆలస్యం