Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తుంది

భూపాలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.

ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తుంది
Share Short Clip Download PDF

అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను ప్రజా ప్రభుత్వం అందిస్తుందని భూపాలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపూర్ మండలంలోని పలు గ్రామాల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిని చేశారు.

అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తూ ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందన్నారు. ఆర్ధిక స్వావలంబనా కోసం ప్రభుత్వలో నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో రేషన్ కార్డులు ఇవ్వని పరిస్థితి ఉండేదని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అనేక సంక్షేమ పథకాలను అందిస్తుందని అన్నారు. మహిళా సంఘాలను గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా వీవో సంఘాల భవన నిర్మాణాలతో పాటు, వడ్డీ లేని రుణాలను అందించి ఆర్ధికంగా మెరుగుపడేట్లుగా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.