దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు రాహుల్ గాంధీ గారు చేస్తున్న పోరాటాన్ని అణిచివేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ప్రజల ఓటు హక్కు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ వైఖరికి నిదర్శనమన్నారు. ఓట్ల అక్రమాలు, ఓటు చోరీకి సంబంధించిన ఆరోపణలపై ప్రశ్నలు లేవనెత్తుతున్న రాహుల్ గాంధీ గారిపై చర్యలు తీసుకోవడం కాకుండా, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉందని అన్నారు.
సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, ఆయనను పదవి నుంచి తొలగించడంతో పాటు అరెస్ట్ చేయాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ గారి పోరాటానికి దేశవ్యాప్తంగా ప్రజల మద్దతు ఉందని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఐక్యంగా ఉద్యమిస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల గొంతును అణిచివేయాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా ప్రజల తరఫున పోరాడుతుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మెన్ అజీజ్ ఖాన్, జిల్లా, నియోజకవర్గ ముఖ్య నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, డీసీసీ, బ్లాక్, మండల, డివిజన్ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.