హనుమకొండ (రైట్స్ మీడియా): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన ఓటు హక్కును కూడా హరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన నిరసనపై ఢిల్లీలో పోలీసులు అరెస్ట్ చర్యలను నిరసిస్తూ హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇనగాల వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి పాల్గొన్నారు.
హనుమకొండ డీసీసీ కార్యాలయం నుంచి అశోక్ జంక్షన్ వరకు కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు.