మహబూబాబాద్ (రైట్స్ మీడియా): కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి జైపాల్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో జిల్లాలోని (17) క్లస్టర్లకు గాను (34) సిఆర్పి లకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం జాతీయ మిషన్ నేచురల్ ఫామింగ్ ఆధ్వర్యంలో ప్రారంభం అయ్యింది.
క్యాన్సర్ నివారణ ప్రకృతి వ్యవసాయంతో సాధ్యం..
⏩ప్రకృతి వ్యవసాయంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి: జాతీయ మిషన్ ప్రకృతి వ్యవసాయం పై సిఆర్పి లకు శిక్షణ తరగతుల కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపే విధంగా వ్యవసాయ ఉద్యానవన శాఖ శాస్త్రవేత్తలు, అధికారులు చర్యలు తీసుకోవాలని, తద్వారా ప్రజలు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని కూరగాయలను తీసుకుని ఆరోగ్యవంతంగా ఉంటారని సూచించారు.
శనివారం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు, సిబ్బందికి సేంద్రియ ఎరువుల తయారీ, వాడకం, ప్రకృతి వ్యవసాయం పై ఘనామృతం, జీవామృతం, బిశామృతం గశపర్ణి కషాయం, నూతన టెక్నాలజీ విధంగా ఎలా తయారు చేయాలి అనే అంశంపై శిక్షణ తరగతులు ఇవ్వడం జరుగుతుందని, శిక్షణను తాను స్వయంగా పరిశీలించడం జరిగిందన్నారు.
జైపాల్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో అడ్వాన్సుడ్ జీవామృతం తయారుచేసే యూనిట్ను పరిశీలించారు. జిల్లాలో రైతులు సిఆర్పి లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న కార్యక్రమాల ద్వారా సేంద్రియ ఎరువులు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ తరగతులు నిర్వహించి సబ్సిడీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ, అధికారులు విస్తరణ అధికారులు ఉద్యానవన శాఖ, శాస్త్రవేత్తలు, సంబంధిత అన్ని విభాగాల సిబ్బందితో సమన్వయంతో కలిసి పనిచేసి రైతులకు మేలు చేసే విధంగా పక్క ప్రణాళికతో ముందుకు సాగాలని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయచంద్ర, ఉద్యానవన శాఖ అధికారి జి. మరియాన్న, శాస్త్రవేత్త, హెచ్ఓడి మల్యాల ప్రశాంత్, జైపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రామారావు, నాగేశ్వరరావు, స్థానిక తహసిల్దార్ వివేక్, వ్యవసాయ శాఖ ఏవో విస్తరణ అధికారి తదితరులు పాల్గొన్నారు.