జగిత్యాల జిల్లా మెట్ పల్లి ఐసిడిఎస్ సిడిపివో దారోజు పద్మ శనివారం రూ.63 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కరీంనగర్ ఇన్చార్జి ఏసిబి డిఎస్పీ గొర్రె మధు తెలిపిన వివరాల ప్రకారం.. మెట్ పల్లి పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాల తనిఖీల నివేదికలో ప్రతికూల వ్యాఖ్యలు రాయకుండా ఉండేందుకు ప్రతి అంగన్వాడీ కేంద్రం నుండి 3వేల రూపాయల చొప్పున 21 కేంద్రాలకు 63వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆయన తెలిపారు. లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్టు వారు చెప్పారు. ఎవరైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కి నేరుగా ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ తెలిపారు.