కరీంనగర్(రైట్స్ మీడియా): హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలంలో బంజారా భవన్ నిర్మాణానికి మంజూరు ఇవ్వాలని కోరుతూ అక్కన్నపేట సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు బాణోతు వెంకట్‌తో పాటు పలువురు బంజారా నాయకులు కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
బంజారా భవన్ మంజూరు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు బంజారా నాయకుల విజ్ఞప్తి
కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసిన అక్కన్నపేట సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు బాణోతు వెంకట్,పలువురు సర్పంచ్ లు , బంజారా నాయకులు..
కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసిన అక్కన్నపేట సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు బాణోతు వెంకట్,పలువురు సర్పంచ్ లు , బంజారా నాయకులు..
ఈ సందర్భంగా అక్కన్నపేట మండలంలో బంజారా భవన్ నిర్మాణం ఆవశ్యకతను మంత్రికి వివరించి, బంజారా సామాజిక వర్గ ప్రజలకు ఉపయోగపడేలా భవన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. బంజారా ప్రజల సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సమావేశాలు నిర్వహించుకోవడానికి బంజారా భవన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి తమ విజ్ఞప్తిని తెలియజేసిన వారిలో అక్కన్నపేట సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు బాణోతు వెంకట్‌తో పాటు పలువురు ,సర్పంచ్ లు , బంజారా నాయకులు ఉన్నారు.