హైదరాబాద్(రైట్స్ మీడియా): ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (AIPC) చైర్మన్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సోమవారం జూబ్లీహిల్స్ లోని ఎంసీహెచ్ఆర్డీసీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా AIPC చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన మధుయాష్కీ గౌడ్ కి సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి మధ్య సుమారు గంటన్నర పాటు సమావేశం కొనసాగింది.
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఫీజు రీయింబర్స్మెంట్స్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత ప్రభుత్వంలో చేసిన సుమారు రూ.8 లక్షల కోట్ల అప్పులపై వడ్డీ భారం తదితర అంశాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం.