Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

ప్రశ్నించే గొంతులను అరెస్టులతో ఆపలేరు

బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డాక్టర్ బానోత్ సారంగపాణి.

ప్రశ్నించే గొంతులను అరెస్టులతో ఆపలేరు
Share Short Clip Download PDF

నల్లబ్యాడ్జీలు ధరించి బీఆర్ఎస్ శ్రేణుల నిరసన.

ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం ద్వారా ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థను అణచివేసే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ నల్లబెల్లి మండల అధ్యక్షుడు డాక్టర్ బానోత్ సారంగపాణి విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టులను నిరసిస్తూ నల్లబెల్లి మండల కేంద్రంలో సోమవారం పార్టీ నాయకులు, కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.

అనంతరం డాక్టర్ బానోత్ సారంగపాణి మాట్లాడుతూ

ప్రజల తరఫున మాట్లాడాల్సిన ప్రజాప్రతినిధులపై పోలీసు చర్యలకు పాల్పడటం రాజకీయ కక్షసాధింపు చర్యలకు నిదర్శనమని ఆరోపించారు.
ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్ష గొంతులను అణచివేయాలని చూడటం నియంతృత్వ ధోరణికి నిదర్శనమని మండిపడ్డారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో ప్రతిపక్షాలను నిర్బంధాల ద్వారా అణచివేయాలని ప్రయత్నిస్తే ప్రజలు తగిన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్షాలబాధ్యత ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని నిలదీయడం ప్రతిపక్షాల హక్కు మాత్రమే కాకుండా బాధ్యత కూడా అని సారంగపాణి పేర్కొన్నారు. ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారం కావని స్పష్టం చేశారు. నిర్బంధాలు, అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, ప్రజల గొంతును నొక్కే ప్రయత్నం చేస్తే అది మరింత బలంగా వినిపిస్తుందని అన్నారు.

కక్షసాధింపు రాజకీయాలు మానుకోవాలి: మాజీ ప్యాక్స్ చైర్మన్ చెట్టుపెళ్లి మురళీధర్

ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు ధోరణిని విడనాడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని మురళీధర్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా తమ నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని, అవసరమైతే ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ కక్కేర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్ గౌడ్, క్లస్టర్ బాధ్యులు ఇంగ్లీ శివాజీ, మామిండ్ల మోహన్ రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు పులి రమేష్ గౌడ్, సర్పంచ్‌లు నాగేల్లి జ్యోతి ప్రకాష్, కస్తూరి విజయ రవి, మాజీ సర్పంచ్‌లు నానబోయిన రాజారాం, గన్నేబోయిన చేరాలు, మాజీ ఎంపీటీసీ పోడేటి ప్రకాశం, ఉద్యమ నాయకుడు ఆకుల సాంబరావు, సొసైటీ మాజీ డైరెక్టర్ సట్ల శ్రీనివాస్ గౌడ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు కొత్తపెళ్లి అశోక్, నాయకులు రత్నాకర్, చంద్రమోహన్, ఓరంగంటి రాజు, బల్ల రాజేందర్, ఓదెలు, రఘు, నాగేల్లి శ్రీనివాస్, భూస సదయ్య తదితరులు పాల్గొన్నారు.