హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో కాకతీయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె. ప్రతాప్‌రెడ్డి సోమవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ శివ ప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించనున్న 24వ స్నాతకోత్సవానికి గవర్నర్‌ను ఉపకులపతి ఆహ్వానించారు.
స్నాతకోత్సవాన్ని నవంబర్ నెలలో నిర్వహించేందుకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూత్రప్రాయంగా అంగీకరించినట్లు కాకతీయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా స్నాతకోత్సవ నిర్వహణకు సంబంధించిన అంశాలను ఉపకులపతి గవర్నర్‌కు వివరించారు. గవర్నర్ సూత్రప్రాయ అంగీకారంతో 24వ స్నాతకోత్సవ నిర్వహణకు మార్గం సుగమమైందని రిజిస్ట్రార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ రాజేందర్ కట్లా కూడా పాల్గొన్నారు.
24వ స్నాతకోత్సవానికి గవర్నర్ సూత్రప్రాయ అంగీకారం