వర్ధన్నపేట మండల పరిధిలోని చెన్నారం గ్రామంలో కొనసాగుతున్న నక్షా (భూ) రీ-సర్వే పనులను వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) ఎల్ కిషోర్ కుమార్ గురువారం రోజున పర్యవేక్షించారు. గ్రామంలో రెవెన్యూ సిబ్బంది చేపడుతున్న సర్వే పనులను, రోవర్ మిషన్ ద్వారా జరుగుతున్న కొలతలను ఆయన స్వయంగా పరిశీలించారు. రైతుల భూముల హద్దులను క్షేత్రస్థాయిలో ఎలా నిర్ధారిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ రీ సర్వేలో రైతులు సహకరించాలని, తమ భూముల వద్ద ఉండి హద్దులు సరిగ్గా చూపించాలని సూచించారు. రీ సర్వే పూర్తయితే భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట తహసీల్దార్ విజయసాగర్ , ఆర్ఐ హసీఫ్ , సర్వేయర్ గీత,రెవెన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.
చెన్నారంలో నక్షా రీ-సర్వే పనులను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్