వినాయక చవితి మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పవిత్రమైన పండుగ అని, అదే సమయంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ పండుగను జరుపుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మట్టి గణపతులను ప్రతిష్ఠించడం ద్వారా మన సంప్రదాయాన్ని కాపాడటంతో పాటు చెరువులు, కుంటలు, జలవనరులను కాలుష్యం నుంచి రక్షించవచ్చన్నారు
రసాయన రంగులు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉందని, జలచరాలు, పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. అందువల్ల సహజసిద్ధమైన మట్టితో తయారు చేసిన గణేశ్ విగ్రహాలను వినియోగించడం ద్వారా పర్యావరణానికి మేలు చేకూరుతుందన్నారు.
భక్తితో గణపతిని ఆరాధిద్దామని. బాధ్యతతో ప్రకృతిని కాపాడుదామని. మన వినాయకుడు మట్టితో వస్తే.. మన భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ప్రకృతి మిగులుతుందని సుధారాణి పేర్కొన్నారు.
ప్రతి కుటుంబం, ప్రతి కాలనీ, ప్రతి గణేష్ మండపం మట్టి గణపతులనే ప్రోత్సహించి పర్యావరణహితమైన వినాయక చవితి నిర్వహణకు ఆదర్శంగా నిలవాలని కోరారు. అధికారులు, సిబ్బంది మాత్రమే కాకుండా ప్రజలందరూ ఈ సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేసి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.