హైదరాబాద్/ములుగు(రైట్స్ మీడియా): భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి పక్కా ప్రణాళిక రూపొందించి, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు వేగవంతం చేయాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్, రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్ జిల్లా అదనపు కలెక్టర్లను ఆదేశించారు.
గురువారం భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లోకేశ్ కుమార్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
భూముల రీ సర్వే, బృందాల ఏర్పాటు, భూభారతి పెండింగ్ దరఖాస్తులు, హైకోర్టు కేసులు, భూసేకరణ, ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 59 కింద క్రమబద్ధీకరణ దరఖాస్తులు, భూదాన్ భూములపై సమీక్షించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు ములుగు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సీహెచ్ మహేందర్ హాజరయ్యారు.