➤పాత భూభారతి దరఖాస్తులకు నవంబర్ 15 గడువు.
కొత్త దరఖాస్తులను 30 రోజుల్లోగా పరిష్కరించాలి: భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లోకేశ్ కుమార్
హైదరాబాద్/ములుగు(రైట్స్ మీడియా): భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి పక్కా ప్రణాళిక రూపొందించి, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు వేగవంతం చేయాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్, రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్ జిల్లా అదనపు కలెక్టర్లను ఆదేశించారు.
గురువారం భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లోకేశ్ కుమార్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
భూముల రీ సర్వే, బృందాల ఏర్పాటు, భూభారతి పెండింగ్ దరఖాస్తులు, హైకోర్టు కేసులు, భూసేకరణ, ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 59 కింద క్రమబద్ధీకరణ దరఖాస్తులు, భూదాన్ భూములపై సమీక్షించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు ములుగు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సీహెచ్ మహేందర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా లోకేశ్ కుమార్ మాట్లాడుతూ
పాత భూభారతి విధానంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నింటినీ నవంబర్ 15లోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. కొత్త భూభారతి విధానంలో అందే దరఖాస్తులను స్వీకరించిన తేదీ నుంచి 30 రోజుల్లోగా పరిష్కరించాలని ఆదేశించారు. దరఖాస్తుల పరిశీలన, పరిష్కార ప్రక్రియను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ నిర్ణీత గడువులను పాటించాలని సూచించారు.
రీ సర్వే పురోగతి, ఇందుకు అవసరమైన బృందాల ఏర్పాటుపై సమీక్షించారు. రీ సర్వే పనులు సక్రమంగా సాగేందుకు బృందాల ఏర్పాటుపై దృష్టి సారించాలని తెలిపారు. భూదాన్ భూములు, భూసేకరణ అంశాలు, హైకోర్టు కేసుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 59 కింద పెండింగ్‌లో ఉన్న క్రమబద్ధీకరణ దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి పరిష్కరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా ఆర్డీఓ కృష్ణవేణి, డిప్యూటీ తహసీల్దార్ నితీష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.